స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన.. రాహుల్ గాంధీకి అవమానం

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన.. రాహుల్ గాంధీకి అవమానం

దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిసారిలాగే ఈసారి కూడా ప్రధాని మోడీ ఎర్రకోటపై జెండా ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సాక్షిగా ప్రతిపక్ష నాయకుడు ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీకి అవమానం జరిగింది. ప్రోటోకాల్ ను ఉల్లంఘించి రాహుల్ ను అవమానించింది ఎన్డీయే సర్కార్.గత పదేళ్లలో తొలిసారి ఎర్రకోట వద్ద స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన తొలి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కేంద్రం మాత్రం ప్రోటోకాల్ ను పట్టించుకోకుండా ఎక్కడో వెనుక సీటు కేటాయించింది.

వాస్తవానికి ప్రధాని తర్వాత కేంద్ర కేబినెట్ హోదా కలిగిన రాహుల్ గాంధీకి మంత్రులతో సమానంగా సీటు కేటాయించాల్సి ఉంది. అయితే, రాహుల్ కి రెండో వరుసలో సీటు ఇచ్చారు. మొదటి వరుసలో కేంద్రమంత్రులతో పాటు ఒలింపిక్ పతక విజేతలు కొంతమందికి స్థానం ఇచ్చారు.రాహుల్ గాంధీకి రెండో వరుసలో సీటు కేటాయించడంతో అక్కడే మరికొందరు ఒలింపిక్ క్రీడాకారులతో కలిసి కూర్చోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్లు కేంద్రం తీరుపై మండిపడుతున్నారు.