వాషింగ్టన్ డీసీ: ప్రధాని మోడీపై నిత్యం విమర్శల వర్షం కురిపించే కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ అపొజిషన్ లీడర్ రాహుల్ గాంధీ.. తాజాగా మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్.. వాషింగ్టన్ డీసీలోని జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. వాస్తవానికి ప్రధాని మోడీ అంటే నాకు ద్వేషం లేదని అన్నారు. మా ఇద్దరి సైద్ధాంతిక అభిప్రాయాలు మాత్రమే వేరని.. వ్యక్తిగతంగా ఆయనంటే తనకు ఎలాంటి కోపం, ద్వేషం కానీ లేదన్నారు.
Also Read:-కోచింగ్ సెంటర్లంటే నాకు నచ్చవు.. అవి అలాంటి వాళ్లకే అవసరం
ప్రధాని మోడీకి ఒక ప్రత్యేకమైన పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందని.. దానిని మాత్రమే తాను వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. ఇక, ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికలపైన అమెరికా వేదికగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరగలేదని సంచలన ఆరోపణలు చేశారు. భారత కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని మోడీకి అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపించారు. కాగా, సోమవారం సైతం డాలస్ వేదికగా ప్రధాని మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.
.