మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ నుంచి రంగారెడ్డిలోకి ఎంటరైన జోడో యాత్ర

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ నుంచి రంగారెడ్డిలోకి ఎంటరైన జోడో యాత్ర

జడ్చర్ల​/బాలానగర్​/మిడ్జిల్​/షాద్ నగర్, వెలుగు : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఐదురోజుల పాటు సాగిన భారత్ జోడో యాత్ర శనివారం రంగారెడ్డి జిల్లా షాద్‌‌‌‌ నగర్ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఆదివారం ఉదయం 6.03 గంటలకు జడ్చర్ల మండలంలోని లలితాంబిక ఆలయం వద్ద యాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ 7.24 గంటలకు  రంగారెడ్డిగూడకు చేరుకున్నారు.   అక్కడ 20 నిమిషాలు టీ బ్రేక్ తీసుకున్నారు. ఈ సందర్భంగా  కొందరు మహిళలు బతుకమ్మలతో రాగా..  రాహుల్​ వారితో కలిసి బతుకమ్మ,  కోలాటం ఆడారు. అనంతరం కొద్దిదూరం నడిచాక, టీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పిల్లలతో కలిసి కొద్దిసేపు రన్నింగ్ చేశారు. దీంతో పోలీసులు, మీడియా ప్రతినిధులు, నేతలు కూడా పరుగు పెట్టారు.  9.40 గంటలకు బాలనగర్‌‌‌‌‌‌‌‌ చేరుకోగా... అక్కడే లంచ్​ బ్రేక్​ తీసుకున్నారు.  తిరిగి సాయంత్రం 4.00 గంటలకు యాత్ర స్టార్ట్‌‌‌‌ చేసి  బూర్గుల, రాయికల్​ టోల్​గేట్ వద్దకు చేరుకున్నారు.  సాయంత్రం 5.30 గంటలకు అక్కడే 20 నిమిషాలు ట్రీ బ్రేక్​ తీసుకొని షాద్​నగర్​ సోలీపూర్​ ‘వై’ జంక్షన్​ వద్దకు చేరుకొని అక్కడే కార్నర్​ సభలో ప్రసంగించారు.  

అందరినీ పలుకరిస్తూ..

రాహుల్​ గాంధీ యాత్రలో చిన్నా, పెద్ద అందరినీ పలుకరించుకుంటూ ముందుకు వెళ్లారు. రంగారెడ్డిగూడ వద్ద చిన్నారులతో ముచ్చటించారు.   కొందరు   చిన్నారులు కారులో నుంచి జోడో యాత్ర ప్లకార్డులను ప్రదర్శించారు. దారి వెంట నడుకుంటూ వెళ్తున్న అయ్యప్ప స్వాములను రాహుల్​ పిలిపించి..     వారితో మాట్లాడారు.  యాత్రలో నేతలు రేవంత్‌‌‌‌రెడ్డి, ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి, జానారెడ్డి, మధుయాష్కీ గౌడ్‌‌‌‌, కొండా సురేఖ, మునుగోడు అభ్యర్థి స్రవంతి పాల్గొన్నారు.

ట్రాఫిక్​ జామ్

మహబూబ్​నగర్​, నవాబ్​పేట, మిడ్జిల్​, రాజాపూర్, బాలానగర్​​ మండాలకు చెందిన ప్రజలు  భారీగా తరలిరావడంతో జడ్చర్ల నుంచి షాద్​నగర్​ వరకు ట్రాఫిక్​ జామ్‌‌‌‌ అయ్యాంది.  పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఉదయం 5.30 గంటల నుంచి 11.30 గంటల వరకు  ట్రాఫిక్​ స్తంభించిపోయింది.  ముదురెడ్డిపల్లి, రాజాపూర్​, రంగారెడ్డిగూడ, బలానగర్​ మీదుగా  దాదాపు 30 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి.