రాహుల్ గాంధీ కొండగట్టు పర్యటన రద్దు

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ టూర్ లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి గట్టిగా ప్రచారం చేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా రాహుల్ గాంధీతోనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. మూడు రోజుల బస్సు యాత్రతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తోంది.

ఇప్పటికే రెండు రోజులు బస్సు యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. మూడో రోజైన 2023, అక్టోబర్ 20వ తేదీన శుక్రవారం రాహుల్ పర్యటన షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేశారు. ఈరోజు రాహుల్ గాంధీ.. కొండగట్టు,  గంగాధర ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉండగా.. చివరి నిమిషయంలో ఆ రెండు ప్రాంతాల్లో కార్నర్ మీటింగ్స్ రద్దు చేశారు. దీంతో రాహుల్ గాంధీ నేరుగా జగిత్యాల, కోరుట్లలో పర్యటించి ఆర్మూరు సభకు వెళ్లనున్నారు. అనంతరం శంషాబాద్ ఎయిర్పోర్ట్  చేరుకుని ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు.