ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా దాదాపు అందరు అగ్ర రాజకీయ నాయకులు - వాట్సాప్ ఛానెల్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తాజాగా వాట్సాప్ ఛానెల్‌లోకి వచ్చారు. డీపీసీసీ కార్యాలయం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, జిల్లా, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల సమక్షంలో ఈ ఛానెల్ ప్రారంభమైంది . ఇప్పటికే 42 లక్షల మంది ఈ ఛానెల్‌లో చేరారు.
బీజేపీ దాని మిత్రపక్షాలు తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తుంటే, రాహుల్ వాట్సాప్ ఛానెల్ ఎవరికీ భయపడకుండా నిజం మాట్లాడుతుందని కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ తెలిపారు. కాంగ్రెస్ విధానాలను విశ్వసించే వారు నేరుగా రాహుల్ గాంధీ పోస్టులను ఛానెల్ ద్వారా పొందవచ్చని ఆయన తెలిపారు.
Also Read :- రాజకీయ నిరుద్యోగులే మార్పు కోరుకుంటున్నారు : కేటీఆర్