Cricket World Cup 2023: అయ్యర్, రాహుల్ మెరుపు సెంచరీలు.. నెదర్లాండ్స్ ముందు భారీ స్కోర్

Cricket World Cup 2023: అయ్యర్, రాహుల్ మెరుపు సెంచరీలు.. నెదర్లాండ్స్ ముందు భారీ స్కోర్

వరల్డ్ కప్ లో టీమిండియా లీగ్ లో చివరి విజయాన్ని తన ఖాతాలో వేసుకునే పనిలో ఉంది. పసికూన నెదర్లాండ్స్ పై భారత బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు జట్టులో ఏకంగా 5 గురు బ్యాటర్లు తమ బ్యాట్ కు పని చెప్పి 50 కి పైగా స్కోర్ చేశారు. చివరి లీగ్ మ్యాచ్ లో నెదర్లాండ్స్  పై నిర్ణీత 50 ఓవర్లలో 410 పరుగులు చేసి భారీ స్కోర్ ను సెట్ చేసింది. అయ్యర్, రాహుల్ సెంచరీలు తోడు కోహ్లీ, గిల్, రోహిత్ అర్ధ సెంచరీలు చేశారు.   
 
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఓపెనర్లు శుభమన్ గిల్, రోహిత్ శర్మ భారత్ కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు వీరిద్దరూ 100 పరుగులు జోడించిన తర్వాత గిల్ 51 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికీ రోహిత్ 61 పరుగులు, కోహ్లీ 51 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ నెదర్లాండ్స్ బౌలర్లను ఒక ఆటాడుకున్నారు. 

నాలుగో వికెట్ కు అజేయంగా 128 బంతుల్లో 208 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ కు భారీ స్కోర్ అందించారు. ఈ క్రమంలో అయ్యర్ 94 బంతుల్లో 10 ఫోర్లు 5 సిక్సులతో 128 పరుగులు చేస్తే.. రాహుల్ 64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో 104 పరుగులు చేసి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బేస్ డీ లీడ్ 2 వికెట్లు తీసుకోగా వండర్ మెర్వ్, వాన్ మీకరన్ కు క్రా వికెట్ దక్కింది.                            

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)