రాహుల్, ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు.. ఘాజీపూర్ లో ఉద్రిక్తత

రాహుల్, ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు.. ఘాజీపూర్ లో ఉద్రిక్తత

ఢిల్లీ సరిహద్దు ఘాజీపూర్ లో ఉద్రిక్తత నెలకొంది.  యూపీలోని సంభాల్ లో  ఇటీవల జరిగిన  హింసాత్మక ఘటన బాధితులను పరామర్శించేందుకు  వెళ్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక కాన్వాయ్ ను ఘాజీపూర్ దగ్గర  పోలీసులు అడ్డుకున్నారు.  సంభాల్ కు వెళ్లేందుకు అనుమతి లేదంటూ రాహుల్ ను అడ్డుకున్నారు పోలీసులు. రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ నాయకులు కారు దిగి సీనియర్ పోలీసు అధికారులతో చర్చలు జరిపారు. అయినా  ముందుకు వెళ్లడానికి అనుమతించలేదు .దీంతో ఘాజీపూర్ కు భారీగా చేరుకున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. 

పోలీసులు నేషనల్ హైవేను మూసివేయడంతో ఢిల్లీ, యూపీ సరిహద్దు ఘాజీపూర్ లో ఉద్రిక్తత నెలకొంది.  రహదారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు, కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాల మధ్య బారికేడ్లు పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. రహదారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు, కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాల మధ్య బారికేడ్లు పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు.