
మెదక్, వెలుగు : మెదక్ జిల్లా నూతన కలెక్టర్‌గా రాహుల్ రాజ్ నియమితులయ్యారు. ఇక్కడ ఉన్న కలెక్టర్ రాజర్షిషా ఆదిలాబాద్ కు ట్రాన్స్ ఫర్ కాగా.. ఆదిలాబాద్ కలెక్టర్ గా పని చేస్తున్న రాహుల్ రాజ్ మెదక్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకోనున్నారు. మెదక్ ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్ ఆదిలాబాద్ జిల్లాకు ట్రాన్స్ ఫర్ అయ్యారు.