ప్రలోభాలకు లొంగకుండా ఓటు వినియోగించుకోవాలి: రాహుల్ రాజ్

ప్రలోభాలకు లొంగకుండా ఓటు వినియోగించుకోవాలి: రాహుల్ రాజ్

ఆదిలాబాద్, వెలుగు: ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఓటరు నమోదు, వినియోగంపై మంగళవారం పట్టణంలో ఆటో ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. ఆటో ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. 

ALSO  READ :-  మైనంపల్లి ఎంట్రీతో కాంగ్రెస్​లో ఉత్కంఠ

ఈ సందర్భంగా మాట్లాడుతూ డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలకు దూరంగా ఉండాలన్నారు. జిల్లాలో 100 శాతం పోలింగ్ నమోదయ్యేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ట్రైనీ కలెక్టర్ వికాస్ మోహతో, జిల్లా యువజన సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.