
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లా కలెక్టర్గా రాహుల్రాజ్బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆదిలాబాద్ కలెక్టర్గా ఉంటూ ఆయన బదిలీపై మెదక్ జిల్లాకు వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేసిన రాజర్షి షా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు.
జిల్లా అడిషనల్ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్, ఆర్డీవో రమాదేవి, కలెక్టరేట్ ఏఓ యూనస్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, పంచాయతీరాజ్ ఈఈ నర్సింలు, మైనింగ్ ఏడీ జయరాజ్తదితరులు కొత్త కలెక్టర్ రాహుల్రాజ్కు స్వాగతం పలికారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతి, ప్రజాపాలన అమలుతీరు, ధరణి, తాగునీటి సమస్య, ఏడుపాయల జాతర ఏర్పాట్లు తదితర అంశాలపై రాహుల్రాజ్ అధికారులతో చర్చించారు.