ప్రముఖ నటుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్లో విషాదం.. ఏమైందంటే..?

ప్రముఖ నటుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్లో విషాదం.. ఏమైందంటే..?

టాలీవుడ్ ప్రముఖ నటుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రాహుల్ రవీంద్రన్ తండ్రి "రవీంద్రన్ నరసింహన్" శుక్రవారం ఉదయం మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో భాదపడుతున్న నరసింహన్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడంతో తుది శ్వాస విడిచారు.

ఈ విషయాన్ని రాహుల్ రవీంద్రన్ మరియు ఆయన భార్య ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అలాగే నరసింహన్ ఫోటోలు షేర్ చేస్తూ  "నాన్న ఉన్నారులే, చుస్కుంటారు, అనే మాటకి విలువ నాన్నని కోల్పోయినవాళ్ళకే తెలుసు. నాకు అది ఈరోజు తెలిసింది” అంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. దీంతో పలువురు అభిమానులు, సన్నహితులు రాహుల్ రవీంద్రన్ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా నటుడు రాహుల్ రవీంద్రన్ తెలుగులో ప్రముఖ డైరెక్టర్ హనూ రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన "అందాల రాక్షసి" సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆమధ్య ప్రముఖ హీరో నాగార్జున నటించిన మన్మధుడు సినిమాకి దర్శకత్వం వహించాడు. కానీ ఈ సినిమా పెద్దగా అలరించలేదు.