అమెరికాకు చేరుకున్న రాహుల్..ఏప్రిల్​ 21న బ్రౌన్ వర్సిటీ సందర్శన

అమెరికాకు చేరుకున్న రాహుల్..ఏప్రిల్​ 21న  బ్రౌన్ వర్సిటీ సందర్శన
  • ఎన్‌‌ఆర్ఐలు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యే చాన్స్
  • 21, 22న బ్రౌన్ వర్సిటీ సందర్శన

బోస్టన్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు. శనివారం (లోకల్‌‌‌‌‌‌‌‌ టైమ్) బోస్టన్ లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టుకు చేరుకున్న ఆయనకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. రాహుల్ తన పర్యటనలో భాగంగా ఈ నెల 21, 22న బ్రౌన్ యూనివర్సిటీని సందర్శించనున్నారు. అక్కడి విద్యార్థులు, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవుతారు.

అలాగే ఎన్‌‌‌‌‌‌‌‌ఆర్ఐలు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నేతలతోనూ సమావేశమయ్యే అవకాశం ఉంది. కాగా, ప్రతిపక్ష నేతగా ఎన్నికైన తర్వాత రాహుల్ అమెరికాకు వెళ్లడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2024 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడ్రోజుల పాటు అక్కడ పర్యటించారు. ఆ టైమ్‌‌‌‌‌‌‌‌లో డల్లాస్‌‌‌‌‌‌‌‌లో యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్లు, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇండియన్ కమ్యూనిటీతో సమావేశమయ్యారు. అనంతరం వాషింగ్టన్ డీసీలో జార్జ్‌‌‌‌‌‌‌‌టౌన్ యూనివర్సిటీ 
స్టూడెంట్లు, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్  అయ్యారు.