రాజకీయాల్లో నెగ్గు కురావడానికి సర్దుబాటు ధోరణి కూడా చాలా అవసరం. అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పవర్ ఫుల్ గా మారిన ప్రస్తుత దశలో వాటిని డీల్ చేయడంలో చాలా ఓర్పు, నేర్పు అవసరం.ఈ విద్యలో ప్రధాని నరేంద్ర మోడీ దూసుకుపోతుంటే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాం ధీ వెనకబడ్డా రన్నది రాజకీయ పండితుల విశ్లేషణ. కర్ణా టకలో హెడ్ డీ కుమారస్వామి ప్రమాణస్వీకా రం సందర్భంగా సోనియా గాం ధీ, బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి చాలా సేపు మాట్లాడుకున్నారు . దీంతో బీఎస్పీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుం దన్న ఊహాగానాలు రాజకీయవర్గాల్లో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ఊహాగానాలను వాస్తవం చేయడంలో రాహుల్ ఫెయిల్ అయ్యారన్న విమర్శలు ఆ తర్వాత వినిపించాయి. కిందటేడాది చివరిలో మూడు హిందీ రాష్ట్రా ల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని మాయావతి తేల్చి చెప్పారు . మాయావతికి మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రముఖుడు దిగ్విజయ్ సింగ్ తో గొడవలున్నాయి. కాంగ్రెస్ కు ఆమె దూరం కావడానికి ఇదే ప్రధాన కారణమని రాజకీయ పండితులు చెబుతున్నారు . అయితే మాయావతి సాదా సీదా లీడర్ కాదు. దేశవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఉన్న దళిత నాయకురాలు. ఆమెకంటూ ఒక ఓటు బ్యాంక్ ఉంది. ఈ వాస్తవాన్ని గమనిం చి నేర్పు గా వ్యవహరిం చి లోక్ సభ ఎన్నికల్లో అయినా మాయావతితో కాంగ్రెస్ పొత్తుపెట్టుకోవాల్సిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాహుల్ నుం చి పెద్దగా ప్రతిస్పం దన రాకపోవడంతో సమాజ్ వాది పార్ టీఅధినేత అఖిలేశ్ యాదవ్ తో కలిసి ఉత్తరదేశ్ లో బీజేపీకి వ్యతిరేకంగా ఓ కూటమి ఏర్పాటు చేసుకున్నారు. ఎవరెన్ని మాటలు చెప్పినా ఉత్తరప్రదేశ్ పాలిటిక్స్ లోకులాల లెక్కలే కీలకం. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. రాహుల్ ఈ విషయంలో నేర్పుగా వ్యవహరించకపోవడం వల్లనే ఓబీసీలు, దళితులకు ప్రాతినిధ్యం వహించే అఖిలేశ్, మాయావతి కాంగ్రెస్ ను పక్కన పెట్టి యూపీ వరకు కూటమి పెట్టుకున్నారంటున్నారు రాజకీయ పండితులు. కాంగ్రెస్ అక్కడితో ఆగలేదు. దళిత రాజకీయాల్లో మాయావతికి వ్యతిరేకిగా ముద్రపడ్డ ‘ జై భీమ్ ’ పార్టీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ ను ఆస్పత్రికి వెళ్లి ప్రియాంక గాంధీ పరామర్శించారు. దీంతో మాయావతికి పుం డుమీద కారం చల్లినట్లయింది. యూపీలో కాంగ్రెస్ కు సవాల్ విసురుతు న్నది ఎస్పీ, బీఎస్పీ, ఆర్ ఎల్డీ కూటమే….బీజేపీ కాదు. ఈ వాస్తవాన్నిగమనించడంలో రాహుల్ పొరపాటు పడ్డారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికైతే యూపీలో కాంగ్రెస్ కు ఎలాంటి పట్టులేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు పాత వైభవం తీసుకురావాలనుకుంటే కొంతకాలం పాటు ప్రాంతీయ పార్టీ లపై ఆధారపడక తప్పదంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.
పశ్చిమ బెంగాల్లో ……
ఉత్తరప్రదేశ్ లో చేసిన పొరపాటునే పశ్చిమ బెంగాల్లో కూడా రాహుల్ చేశారంటున్నారు రాజకీయ పండితులు. జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాటంలో ముందున్న మమతా బెనర్జీ వంటి ఫైర్ బ్రాండ్ నాయకురాలిని కాంగ్రెస్ దూరం చేసుకోవడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోం ది. బెంగాల్లో కాంగ్రెస్, లెఫ్ట్ హవా తగ్గిం దన్న సంకేతాలు అందడంతోనే బీజేపీ రంగంలోకి దిగి దూసుకుపోతోం ది. బెంగాల్లో ప్రధాన పోటీ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉందన్న పిక్చర్ కనిపిస్తోంది.
ఢిల్లీలో నూ…..
ఢిల్లీలో బీజేపీ పై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిరోజూ యుద్దమే చేస్తోంది. బీజేపీ కావాలని నియమిం చిన లెఫ్టినెం ట్ గవర్నర్ తో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చాలా రోజులు పోరాటమే చేశారు.చివరకు లెఫ్టినెం ట్ గవర్నర్ దూకుడుకు కళ్లెం వేయడానికి సుప్రీంకోర్టు గడప కూడా తొక్కారు . బీజేపీకి వ్యతిరేకంగా ఢిల్లీలో , కోల్ కతాలో జరిగిన సభల్లో పాల్గొన్నారు . అలాంటి ‘ఆప్’ తో లోక్ సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడంలో కూడా రాహుల్ గాం ధీ ఉత్సాహం చూపలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు ‘ఆప్’ తో పొత్తు కోసమే అజయ్ మాకెన్ ను పక్కన పెట్టి, మాజీ సీఎం, సీనియర్ లీడర్ షీలా దీక్షిత్ కు పీసీసీ ప్రెసిడెంట్ ను చేశారన్న వార్తలు కూడా వచ్చాయి. ఇంత కసరత్తు జరిగినా, చివరకు ‘ఆప్’ తో కాంగ్రెస్ కు పొత్తు కుదరలేదు. దీన్ ని కూడా రాహుల్ పొరపాటుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు .‘ఆప్’కేవలం ఢిల్లీకే పరిమితమైన పార్టీ కాదు. పంజాబ్, హర్యానాల్లో కూడా ‘ఆప్’ కు పలుకుబడి ఉంది. బలమైన కేడర్ ఉంది. ‘ఆప్’ తో పొత్తు కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఉంటే ఢిల్లీ లో బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయడం ఈజీ అవుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. రాహుల్ గాంధీ తనపై ఉన్న ‘ పప్పు ’ ఇమేజ్ ను చెరిపేసుకోవడానికి చాలా కష్టపడ్డా రు. రాఫెల్ డీల్ పై ఎన్డీయే సర్కార్ ను డిఫెన్స్ లో పడేయడంలో సక్సెస్ అయ్యారు . మూడు హిందీ రాష్ట్రా ల్లో కాంగ్రెస్ ను అధికారానికి తీసుకువచ్చి సత్తా చాటారు. అయితే లోక్ సభ ఎన్నికల సమయంలో మిత్రపక్షాలతో వ్యవహరిం చడంలో మరిం త నేర్పు చూపించి ఉండాల్సిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
– అమూల్య గంగూలి, పొలిటికల్ ఎనలిస్ట్