జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవగ్రహాల్లో కొన్ని గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయని.. మరికొన్ని రాశుల వారికి మిశ్రమఫలితాలు..ఇంకొన్ని రాశుల వారు చాలా కష్టాలు పడతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆస్ట్రాలజీ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం సంపదలను శుక్రుడు సృష్టిస్తాడు. పాపగ్రహం.. ఛాయా గ్రహంగా చెప్పుకునే శుక్రుడు 18 ఏళ్ల తరువాత ఫిబ్రవరి 1 వ తేదీన ఉదయం 8:37 గంటలకు రాహువు ఉన్న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి వెళ్తాడు. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రంలో మీనరాశిలో రాహువు శుక్ర గ్రహాల కలయిక ఏర్పడుతుంది. దీనివలన మూడు రాశుల వారికి విశేషంగా కలిసి వస్తుంది. ఇప్పుడు ఆ రాసుల గురించి తెలుసుకుందాం. .
మేషరాశి : 2025 ఫిబ్రవరి 1 నుంచి ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా కలసి వస్తుంది. రాహువు.. శుక్రుడు మీనరాశిలో సంచరించడం వలన గతంలో ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. పెళ్లికోసం ఎదురు చూసే వారికి మంచి సంబంధం కుదురుతుంది. విదేశీ ప్రయాణం కలసి వస్తుంది. మేష రాశివారికి శని భగవానుడి ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో పూర్వీకుల ఆస్తులు కలసి వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం. ఎలాంటి ఛాన్స్ వచ్చినా మిస్ చేసుకోవద్దని పండితులు చెబుతున్నారు.
వృషభ రాశి: మీనరాశిలో శుక్రుడు.. రాహువు ఫిబ్రవరి 1న కలవడం వలన వృషభరాశి వారు కెరీర్ లో అద్భుతమైన విజయాలు పొందుతారు. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెడితే వచ్చే లాభాలు ఊహకు అందవని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇక వృషభరాశి ఉద్యోగస్తులు కార్యాలయంలో తమదైన ముద్రను చాటుతారు. ప్రతి పని కూడా మీరు లేనిదే కాదు అనే పరిస్థితి ఏర్పడుతుంది. అనుకోకుండా ప్రమోషన్ రావడం.. వేతనం పెరగడం లాంటివి జరుగుతాయి. ఆర్థికంగా ఎంతో పురోభివృద్ది సాధించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధువులతో... స్నేహితులతో గడుతుపుతారు. రాజకీయంలో ఉన్నవారు మంచి విజయాలను అందుకుంటారు. కోర్టు కేసుల నుంచి బయట పడతారు. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి మంచి సంబంధం కుదురుతుంది.
మకరరాశి : రాహువు.. శుక్రుడు మీనరాశిలో ఫిబ్రవరి 1న కలుస్తారు. దీంతో ఈ రాశి మకరరాశి వారు చాలా గొప్ప విజయాలను సాధిస్తారు. కెరీర్ లో ఊహించని ఫలితాలు పొందుతారు. తోబుట్టువులతో ఇప్పటి వరకు ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. శని భగవానుడు అనుగ్రహం పుష్కలంగా ఉండటంతో .. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కొన్ని కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వారికి ఊహించని లాభాలు వస్తాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు.