Raid 2 Trailer: రైడ్ 2 ట్రైలర్ విడుదల.. అటు అధికారం.. ఇటు నిజం.. రసవత్తరంగా ఐటీ రైడ్స్‌‌

Raid 2 Trailer: రైడ్ 2 ట్రైలర్ విడుదల.. అటు అధికారం.. ఇటు నిజం.. రసవత్తరంగా ఐటీ రైడ్స్‌‌

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌ ‘రైడ్ 2’(Raid 2). 2018లో వచ్చిన  సూపర్ హిట్ మూవీ ‘రైడ్‌‌’కు ఇది సీక్వెల్. రాజ్ కుమార్ గుప్తా దర్శకుడు. రితేష్ దేశ్‌‌ముఖ్, వాణి కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ క్రమంలో నేడు ఏప్రిల్ 8న 'రైడ్ 2' ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అమయ్ పట్నాయక్ (అజయ్ దేవ్‌గన్) పాత్రతో మళ్ళీ తిరిగొచ్చాడు. అధికార యుద్ధంతో పాటు రైడ్ 1 జ్ఞాపకాలను మిళితం చేస్తూ ట్రైలర్ ఆసక్తిగా సాగింది.

అతని కెరీర్లో 74 రైడ్స్‌‌, అలాగే 74 ట్రాన్స్‌‌ఫర్స్, సీజ్ చేసిన మొత్తం రూ.4200 కోట్లు... అమయ్ పట్నాయక్ ఈజ్ బ్యాక్‌‌.. ” అంటూ అజయ్‌‌ దేవగణ్‌‌ పోషిస్తున్న ఇన్‌‌కమ్ టాక్స్‌‌ ఆఫీసర్‌‌‌‌ పాత్రను పరిచయం చేశారు.

Also Read:-హీరోయిన్ తో కనిపించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. ఆడవాళ్ళని అడ్డుపెట్టుకుని రాజకీయాలేంటంటూ..

తన ఐటీ రైడ్స్‌‌తో పొలిటీషియన్స్, బిజినెస్‌‌ మ్యాన్స్‌‌, బిగ్ షాట్స్‌‌కు చెమటలు పట్టించే అమయ్ పట్నాయక్‌‌కు ఈసారి దాదా భాయ్ అనే ఓ బడా పొలిటీషియన్‌‌ ఇంటిపై రైడ్‌‌ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తాయి. ఇది తనకు 75వ ఐటీ రైడ్. దాదా భాయ్ పాత్రను రితేష్ దేశ్‌‌ముఖ్‌‌ పోషించాడు. అతని తలుపును తడుతూ కనిపించే సీన్ అదిరిపోయింది.

మీ పాండవులు ఎప్పటినుంచి నాపై చక్రవ్యూహం పన్నుతున్నారు అని ఫోన్‌‌లో రితేష్ అడుగుతుంటే.. నేను పాండవ అని ఎప్పుడూ చెప్పలేదే, పూర్తి మహాభారతమే నేను’ అంటూ అజయ్ దేవగణ్‌‌ చెప్పిన డైలాగ్‌‌ టీజర్‌‌‌‌కు హైలైట్‌‌గా నిలిచింది. పట్నాయక్-దాదా భాయ్ పాత్రల మధ్య ఉద్రిక్తత స్పష్టంగా కనిపిస్తుంది. ఈసారి ఐటీ రైడ్‌‌ రసవత్తరంగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్ధమైపోతుంది. ‘ఓ వైపు అధికారం.. మరోవైపు నిజం.. ఈ ప్రయాణం ఇప్పుడు మరింత పెద్దదిగా మారింది’ అంటూ అజయ్‌ దేవ్‌గణ్‌ Xలో పోస్ట్ చేశాడు. 

ఈ సినిమాలో రజత్ కపూర్, సౌరభ్ శుక్లా, సుప్రియా పాఠక్ ఇందులో ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భూషన్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ విషయం ఇలా ఉండగా రైడ్ చిత్రాన్ని ఇటీవలే టాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్  'మిస్టర్ బచ్చన్' పేరుతో రీమేక్ చేసి విడుదల చేసారు. కానీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.