హైదరాబాద్: తెలంగాణలో ఎక్సైజ్, డ్రగ్ కంట్రోల్ అధికారులు జాయింట్ ఆపరేషన్ చేశారు. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్ధాల అక్రమ నిల్వలు, విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించారు. చాంద్రాయణగుట్ట బకోబన్ హాస్పిటల్, వారాసిగూడ బౌద్ధనగర్లోని BVK రెడ్డి హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు.
జాయింట్ ఆపరేషన్లో పలు డ్రగ్, మెడిసిన్స్ సీజ్ చేశారు. సీజ్ చేసిన వాటిలో చాంద్రాయణగుట్ట బకోబన్ హాస్పిటల్లో 47 ఫెంటానిల్ ఇంజెక్షన్లు, వారాసిగూడ బౌద్ధనగర్ లో BVK రెడ్డి హాస్పిటల్లో 21 ఫెంటానిల్ ఇంజెక్షన్లు, 9 కెటామైన్ ఇంజెక్షన్లు, 2 మిడాజోలం ఇంజెక్షన్లతో సహా నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్ధాల భారీ నిల్వలను అధికారులు గుర్తించారు.