కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హోటల్లో ఫుడ్ సెక్యూరిటీ అధికారుల ఆదివారం తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత పాటించకుండా, నాణ్యతలేని ఆహారపదార్థాలు విక్రయిస్తున్న పలు హోటళ్లపై కేసు నమోదు చేశారు. కరీంనగర్ టౌన్ లోని శ్వేతా హోటల్ తనిఖీల్లో కాలం చెల్లిన వస్తువులు ఫుడ్ సేఫ్టీ అధికారుల గుర్తించారు. స్టోర్ రూమ్ లో కాలం చెల్లిన జీడిపప్పు, ఆయిల్ మసాలాలు లభ్యమైయ్యాయి. నాసిరకం ఐస్ క్రీమ్స్, ఎక్స్ పెయిరీ డేట్ ముగిసిన చాక్లెట్ సిరప్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శాంపుల్స్ తీసుకొని ల్యాబ్ కు పంపించారు.