
- రూ. 70 లక్షల విలువ గల ముడి పదార్థాల సీజ్
- నలుగురు నిందితుల అరెస్టు
సంగారెడ్డి టౌన్ , వెలుగు : నిషేధిత పదార్థాలైన ఆల్ఫాజోలం యూనిట్లపై పోలీసులు దాడి చేశారు. రూ.70 లక్షల విలువ గల ముడి పదార్థాలు సీజ్ చేసి, నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. బుధవారం ఎస్పీ రూపేశ్, డీఎస్పీ రమేశ్కలిసి వివరాలు వెల్లడించారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు పసల్వాది గ్రామ శివారులో దాడులు నిర్వహించి ఆల్ఫా జోలం తయారీ యూనిట్‌ను గుర్తించామన్నారు. 2 డిస్టిలేషన్ యూనిట్లు, నిందితులు ఉపయోగించిన ఫోన్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
కంది మండలం ఇస్మాయిల్ ఖాన్ పేటకు చెందిన బ్రహ్మానంద గౌడ్ , పటాన్చెరు శాంతినగర్ కు చెందిన డేవిడ్ 2018 లో అండర్ ట్రయల్ నేరస్థులుగా కంది జైల్లో పరిచయమయ్యారని, బయటికి వచ్చిన తర్వాత ఆల్ఫా జోలం తయారు యూనిట్‌ను ప్రారంభించారని పేర్కొన్నారు. వ్యాపారానికి సాయం చేయడానికి పసలవారికి చెందిన వినోద్ కుమార్ ను నియమించుకున్నట్లు తెలిపారు. నివాస ప్రాంతాల్లో రహస్య కార్యకలాపాలు జరుగుతుంటే వెంటనే జిల్లా పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.