ఫుడ్​సేఫ్టీ అధికారులు.. ఉప్పల్‌లో 3 హోటళ్లకు నోటీసులు

ఉప్పల్, వెలుగు: ఉప్పల్​లో జీహెచ్ఎంసీ ఫుడ్​సేఫ్టీ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. ఏవీడీ స్వీట్స్ కంపెనీ, పిస్తా హౌస్, సురభి హోటల్​లో తనిఖీలు చేసి నోటీసులు జారీ చేశారు. పిస్తా హౌస్ కిచెన్ అపరిశుభ్రంగా ఉందని, శాంతినగర్​లోని ఏవీడీ కంపెనీలో వేడి పదార్థాలను ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిల్వ చేశారని పేర్కొన్నారు. సురభి హోటల్ కిచెన్ సైతం సీజ్ చేశామన్నారు. ఆయా హోటల్లోని శాంపిల్స్ సేకరించి ల్యాబ్​కు పంపించినట్లు చెప్పారు.