విద్యార్థినులకు అసభ్య వీడియోలు చూపించడం, అసభ్యకరంగా ప్రవర్తించడంతో కీచక ఉపాధ్యాయుడి సస్పెండ్ చేశారు అధికారులు. జగిత్యాల జిల్లా రాయికల్ హై స్కూల్ లో పని చేస్తున్న కీచక ఉపాధ్యాయుడు జే. శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు. విద్యార్థినులకు అసభ్య వీడియోలు చూపించడం, వారితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో విద్యార్థినిలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
విచారణలో ఈ విషయం నిజమని తేలడం తో ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ.. డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు.