దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలను కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దేశంలోని 23 రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఇక దేశవ్యాప్తంగా 800 గ్రామాలకు వరదముప్పు ప్రమాదం పొంచి ఉందని ...లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖాధికారులు హెచ్చరికలు జారీచేశారు.,
తెలంగాణలో....
తెలుగు రాష్ట్రాల్లో ఐదురోజుల పాటు ( జులై 14 నుంచి) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. అయితే ఇవాళ ( జులై 13) తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణశాఖ. రాత్రికి హైదరాబాద్, ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్రలో మోస్తరు వాన పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశముంది. తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి,మెదక్, కామారెడ్డిలో జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. దాంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.రానున్న మూడ్రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ALSO READ | నదిలో పడి కొట్టుకుపోయిన బస్సులు 65 మంది గల్లంతు
దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి, ఉత్తర భారతంలోని రాష్ట్రాలతో పాటు తూర్పు భారతదేశంలోని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే ఐదు రోజులు ( జులై 14 నుంచి) మధ్య, ఈశాన్య, తూర్పు భారతదేశం మరియు ఉత్తరప్రదేశ్‌లో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. కొంకణ్, గోవా, సెంట్రల్ మహారాష్ట్ర మరియు కోస్టల్ కర్నాటకలో పలు ప్రదేశాల్లో కుండపోతగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లో...
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ తీరములో సముద్ర మట్టానికి సగటున 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఈశాన్య అస్సాం నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఒక ద్రోణి కొనసాగి ఈరోజు బలహీనపడింది. సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో పశ్చిమ అస్సాం నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి కొనసాగి బలహీనపడింది. దీని ప్రభావంతో మరో ఐదు రోజులు పాటు ( జులై 14 నుంచి ఏపీలో వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముందని, రాయలసీమ జిల్లాలో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
దేశవ్యాప్తంగా...
బీహార్ రాష్ట్రానికి వరద తాకిడి ఎక్కువుగా ఉండే అవకాశం ఉందని IMD తెలిపింది. జార్ఖండ్‌లో రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల వరదలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో ఆది, సోమవారాలు ( జులై 14,15) భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అయితే ఈశాన్య భారతదేశంలో రాబోయే ఐదు రోజులు ( జులై14 నుంచి) పిడుగులు పడే ఉండొచ్చని IMDపేర్కొంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
#WATCH राष्ट्रीय राजधानी दिल्ली के कई हिस्सों में बारिश हुई। वीडियो आरके पुरम से ली गई है। pic.twitter.com/FaEgCAjhtY
— ANI_HindiNews (@AHindinews) July 13, 2024
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో భారీ వర్షం కురిసింది. 12 గంటల వ్యవధిలోనే అత్యధికంగా 90 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈ వర్షానికి పలు ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తాయి. మరోవైపు నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. జులై 14 నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇటావా, ఔరైయా, గొండా, కన్నౌజ్, అయోధ్య సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు.
ALSO READ | జమ్మూ కశ్మీర్ లో 4.2 తీవ్రతతో భూకంపం..
మరోవైపు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని డెహ్రాడూన్, నైనిటల్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాల్లో సెప్టెంబర్ 13న భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని 23 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తెహ్రీ, బాగేశ్వర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడంతోపాటు ఇళ్లు కూలిపోయాయి.
ALSO READ | బిహార్లో పిడుగుపడి 21 మంది మృతి
ఇక రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఒడిశాలో జులై 14, 15 తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అదేవిధంగా తూర్పు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అస్సాం, మేఘాలయలో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో వర్ష ప్రభావం ఉండొచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
#WATCH गुजरात: वलसाड में भारी बारिश के कारण शहर के कई रिहायशी इलाकों और घरों में जलभराव हुआ। pic.twitter.com/5n7aGCsag0
— ANI_HindiNews (@AHindinews) July 13, 2024