ఎండలు బాబోయ్ ఎండలు.. కాదు కాదు.. వానలు బాబోయ్ వానలు.. ఎస్.. నిన్న మొన్నటివరకు మండే ఎండలపై అలెర్ట్‌లు.. ఇప్పుడు.. దంచి కొట్టే వానలపై అలెర్ట్‌లు వస్తున్నాయ్.. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయ్.. హైదరాబాద్‌లోనూ ఆదివారం ( మే 12) సాయంత్రం వర్షం బీభత్సం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. . ఇప్పుడు మరోసారి వాతావరణ శాఖ హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన చేయడం భయపెడుతోంది. ఇవాళ, రేపు ( మే 12, 13) హైదరాబాద్ నగరంలో వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ.. కాసేపట్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
కుండపోత వానతో హైదరాబాద్ నగరం అతలాకుతలం అయ్యే అవకాశం ఉండటంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. గత వారంలో మండే ఎండాకాలంలో రికార్డుస్థాయి వర్షపాతం నమోదు అయింది. అయితే.. మరోసారి వాతావరణశాఖ హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన చేయడంతో నగరవాసులు వణికిపోతున్నారు. అటు.. నిన్నటి పరిస్థితుల నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది, DRF బృందాలు అప్రమత్తమయ్యాయి.
రాష్ట్రానికి ఇవాళ, రేపుభారీ వర్షసూచన చేసింది వాతావరణశాఖ. రేపు ( May13) హైదరాబాద్ లో భారీ వర్షాలుంటాయని చెప్పింది. ఉపరితలఆవర్తనం కారణంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని అలెర్ట్ ఇచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరింపజేసింది. రేపు ఎలక్షన్స్ ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది జీహెచ్ఎంసీ.