ట్రైన్ లో వంట లైవ్.. నచ్చితేనే ఆర్డర్

ట్రైన్ లో వంట లైవ్.. నచ్చితేనే ఆర్డర్
  • రైల్ దృష్టి డ్యాష్ బోర్డు ప్రారంభించిన మంత్రి పీయూష్ గోయల్

ail Drishti Dashboard Portal edrishti.cris.org.in Launched by Railway Minister Piyush Goyalన్యూఢిల్లీ: ప్రజలకు రైల్వే సేవలు మరింత దగ్గర చేసేందుకు కేంద్రం నిరంతరం పని చేస్తోందని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో ‘రైల్ దృష్టి డ్యాష్ బోర్డు’ పోర్టల్ ను ప్రారంభించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. డిజిటల్ ఇండియా సాకారంలో భాగంగా దీన్ని అందుబాటులోకి తెచ్చామని చెప్పారాయన. దీని ద్వారా రైల్వేకి సంబంధించిన మరిన్ని సేవలు ప్రజలు సులభంగా యాక్సిస్ చేయొచ్చన్నారు.

ట్రైన్ టైం టేబుల్స్ లైవ్ అప్ డేట్స్, దేశంలోని అన్ని స్టేషన్లు, గూడ్స్ రైళ్ల వివరాలు ఇందులో అందుబాటులో ఉంటాయని చెప్పారు. అన్ని రైల్వే స్టేషన్ల ఫొటోలను డ్యాష్ బోర్డులో చూడొచ్చన్నారు.

రైళ్లలోని ప్యాంటీ కార్ లో వంట చేస్తున్న లైవ్ ఫుటేజీని ప్రజలు చూడొచ్చని, వీడియో చూసి అది నచ్చితేనే ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చని గోయల్ అన్నారు.

కంప్యూటర్, ల్యాప్ టాప్, ట్యాబ్, ఫోన్లలోనూ డ్యాష్ బోర్డును యాక్సిస్ చేసే వీలుందని కేంద్ర మంత్రి చెప్పారు. వీలైనంత సింపుల్ గా దీనిలో వివరాలను ప్రజలకు చేరేలా ‘రైల్ దృష్టి డ్యాష్ బోర్డు’ను డిజైన్ చేసినట్లు తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ డ్యాష్ బోర్డు హ్యాంగ్ అవ్వదన్నారు.

ఐఆర్సీటీసీ యాప్ తో కూడా డ్యాష్ బోర్డును అనుసంధానించాలని అధికారులను ఆదేశించామని గోయల్ చెప్పారు.

డ్యాష్ బోర్డు యాక్సిస్ చేయడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: edrishti.cris.org.in