మళ్లీ తెరపైకి రైల్వే బైపాస్‌‌‌‌

  • కాజీపేట, వరంగల్‌‌‌‌ స్టేషన్లపై రద్దీ తగ్గించేందుకు నిర్ణయం
  • ఐదేళ్ల కిందే ప్రపోజల్స్‌‌‌‌ పెట్టినా వివిధ కారణాలతో ఆగిన ప్రాసెస్‌‌‌‌
  • తాజాగా డిజిటల్‌‌‌‌ సర్వే చేపట్టిన రైల్వే ఆఫీసర్లు

హనుమకొండ/కాజీపేట, వెలుగు : కాజీపేట రైల్వే జంక్షన్‌‌‌‌పై రద్దీని తగ్గించేందుకు గతంలో నిర్మించాలనుకున్న బైపాస్‌‌‌‌ మళ్లీ తెరపైకి వచ్చింది. కాజీపేట, వరంగల్‌‌‌‌ స్టేషన్లలోకి గూడ్స్‌‌‌‌ రైళ్లు రాకుండా బైపాస్‌‌‌‌ ద్వారా పంపించేందుకు ఐదేళ్ల కిందటే ప్రపోజల్స్‌‌‌‌ రెడీ చేశారు. కానీ వివిధ కారణాల వల్ల ఆ ప్రక్రియ మరుగున పడింది. అయితే వరంగల్, కాజీపేట స్టేషన్లపై భారం పడుతుండడం, మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో బై పాస్‌‌‌‌ లైన్ల ఏర్పాటుపై రైల్వే శాఖ మళ్లీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా గతంలో ప్రతిపాదించిన మార్గాల్లో బైపాస్‌‌‌‌ నిర్మించేందుకు ఇటీవల డిజిటల్‌‌‌‌ సర్వే చేశారు. త్వరలోనే భూ సేకరణ స్టార్ట్‌‌‌‌ చేయనున్నట్లు తెలుస్తోంది. 

రెండు చోట్ల బైపాస్‌‌‌‌లు

కాజీపేట రైల్వే జంక్షన్‌‌‌‌కు ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని కలిపే వారధిగా పేరుంది. విజయవాడ, ఢిల్లీ, హైదరాబాద్‌‌‌‌ వంటి ప్రాంతాలకు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. దీంతో ఈ జంక్షన్‌‌‌‌కు రైళ్ల రద్దీ ఎక్కువగా ఉండ డంతో కాజీపేట – విజయవాడ, కాజీపేట–-బల్లార్ష మార్గాల్లో ట్రిప్లింగ్‌‌‌‌ పనులు చేపట్టారు. అయినా రద్దీ పెరగడం, భవిష్యత్‌‌‌‌లో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో గూడ్స్‌‌‌‌ రైళ్లు వరంగల్, కాజీపేట స్టేషన్‌‌‌‌లోకి రాకుండా దారి మళ్లించేందుకు రెండు చోట్ల బైపాస్‌‌‌‌లు ఏర్పాటు చేయాలని రైల్వే ఆఫీసర్లు ప్రపోజల్స్‌‌‌‌ రెడీ చేశారు. ఇందులో భాగంగా వరంగల్‌‌‌‌ జిల్లా వంచనగిరి నుంచి హనుమకొండ జిల్లాలోని ఎల్లాపూర్, ఉప్పల్‌‌‌‌ స్టేషన్ల మధ్య ఒక లైన్‌‌‌‌, అక్కడి నుంచి జనగామ జిల్లా నష్కల్‌‌‌‌ వరకు మరో లైన్‌‌‌‌ నిర్మించేందుకు నిర్ణయించారు. దీంతో బల్లార్ష వైపు నుంచి విజయవాడ వైపు వెళ్లే గూడ్స్‌‌‌‌ ఎల్లాపూర్‌‌‌‌ బైపాస్‌‌‌‌ ద్వారా వంచనగిరి నుంచి, హైదరాబాద్‌‌‌‌ వైపు వెళ్లే గూడ్స్‌‌‌‌ రైళ్లు నష్కల్‌‌‌‌ బైపాల్‌‌‌‌ గుండా రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది.

ఫస్ట్‌‌‌‌ ఫేజ్‌‌‌‌లో నష్కల్‌‌‌‌ – ఎల్లాపూర్‌‌‌‌ లైన్‌‌‌‌...

కాజీపేట జంక్షన్‌‌‌‌ పరిధిలో రెండు చోట్ల బైపాస్‌‌‌‌ లైన్లు ప్రతిపాదించగా మొదటగా నష్కల్‌‌‌‌ – -ఎల్లాపూర్‌‌‌‌ లైన్‌‌‌‌పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. విజయవాడ మార్గంతో పోలిస్తే ఈ మార్గం గుండానే రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ముందుగా ఈ పనులు చేసేందుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. మొదట వడ్డేపల్లి, సోమిడి, భీమారం, చింతగట్టు, ఎల్లాపూర్, బావుపేట గ్రామాల మీదుగా ఉప్పల్‌‌‌‌ శివారు వరకు బైపాస్‌‌‌‌ లైన్‌‌‌‌ వేయాలని నిర్ణయించారు. కానీ ఇటీవల మార్పులు చేసినట్లు తెలిసింది. నష్కల్‌‌‌‌ నుంచి నేరుగా పెద్దపెండ్యాల మీదుగా వరంగల్‌‌‌‌ రింగ్​ రోడ్డుకు సమాంతరంగా ఉనికిచెర్ల, దేవన్నపేట, భీమారం, చింతగట్టు, ఎల్లాపూర్‌‌‌‌ మీదుగా ఉప్పల్‌‌‌‌ వరకు 24.9 కిలోమీటర్ల మేర బైపాస్‌‌‌‌ నిర్మించేందుకు డిజిటల్‌‌‌‌ సర్వే చేస్తున్నారు. పూర్తి స్థాయి సర్వే అనంతరం భూ యాజమానులకు నోటీసులు ఇచ్చి భూ సేకరణ పూర్తయ్యాక పనులు స్టార్ట్‌‌‌‌ చేసే అవకాశం ఉంది. రెండు లైన్ల నిర్మాణానికి ప్రపోజల్‌‌‌‌ పెట్టినా ఒక లైన్‌‌‌‌  మాత్రమే సాంక్షన్‌‌‌‌ అయిందని, కానీ భవిష్యత్‌‌‌‌ అవసరాల దృష్ట్యా డబుల్‌‌‌‌ లైన్‌‌‌‌కు సరిపడా స్థలాన్ని సేకరించనున్నట్లు రైల్వే కన్సస్ట్రక్షన్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు చెందిన ఓ ఆఫీసర్‌‌‌‌ చెప్పారు. 

ఆందోళనలో భూ యజమానులు

నష్కల్‌‌‌‌ నుంచి ఎల్లాపూర్, ఉప్పల్‌‌‌‌ స్టేషన్ల వరకు బైపాస్‌‌‌‌ నిర్మిస్తుండడంతో భూ యజమానులు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసర్లు గుట్టుగా సర్వే చేసి వెళ్తుండడం,  బైపాస్‌‌‌‌ మార్గంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. బైపాస్‌‌‌‌ నిర్మించే మార్గంలోని గ్రామాల ప్రజలు ఇప్పటికే సమావేశాలు నిర్వహించకుంటున్నారు.