ఇకపై జనరల్ ప్రయాణికులకు కూడా భోజనం అందించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇందుకోసం స్టేషన్లో జనరల్ భోగీలు నిలిచే చోట ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అధికారులు. వేసవి పూర్తయ్యే వరకూ ఈ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది రైల్వే శాఖ. జనరల్ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం ఎకానమీ మీల్స్ పేరుతో రూ.20 లకే నాణ్యమైన భోజనం అందుబాటులోకి తెచ్చామని అన్నారు అధికారులు.రూ.20 లకే ఎకానమీ మీల్స్, రూ.50 లకు స్నాక్ మీల్స్ అందిస్తున్నారు. వేసవిలో ప్రయాణికులకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించాలని ఐఆర్ సీటీసీతో కలిసి ఈ ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Also Read:ఢిల్లీ మెట్రోలో..సీటు ఇవ్వలేదని మగాడి ఒడిలో కూర్చున్న మహిళ
జనరల్ బోగీలలో ప్రయాణించే ప్రయాణికుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఈ కౌంటర్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వేసవి పూర్తయ్యే వరకూ ఈ స్పెషల్ కౌంటర్ ఉంటుందని వివరించారు. ప్రస్తుతానికి ఈ కౌంటర్లను ప్రయోగాత్మకంగా విజయవాడ, రాజమహేంద్రవరం స్టేషన్లలో ఏర్పాటు చేసినట్లు డీఆర్‌ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు.