తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల హడావిడి మాట అటుంచితే,ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనుండటంతో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలలో ఉంటున్న చాలా మంది ఏపీ ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ క్రమంలో సిటీలోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ఇదిలా ఉండగా పెరిగిన బాస్ చార్జీలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో రైల్వే శాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది.
ఈ నెల 10నుండి వైజాగ్ మీదుగా ప్రత్యేక రైళ్లు నడవనున్నట్లు తెలిపింది రైల్వే శాఖ. ఈ రైళ్లు వైజాగ్, దువ్వాడ, విజయనగరం స్టేషన్ల మీదుగా నడవనున్నాయి. ఈ స్పెషల్ రైళ్లు మే 11 నుండి జూన్ 11వరకు నడవనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ - బరంపూర్ రైలు ( 071135 ) మీ 11న కాచిగూడలో బయలుదేరుతుందని, తిరిగి మే 12న బరంపూర్ - కాచిగూడ రైలు ( 07136 ) నడుస్తుందని తెలిపారు అధికారులు.
అహ్మదాబాద్ - పూరి రైలు( 09453 )మే 10న అహ్మదాబాద్ లో బయల్దేరింది. తిరిగి మే 12న పూరి - పాల్ది ( 09454 )రైలు పురిలో బయల్దేరుతుంది. చెన్నై ఎగ్మోర్ - భువనేశ్వర్ రైలు ( 06107 ) మే 11న, జూన్ 1న ఉంటుంది. భువనేశ్వర్ - చెన్నై రైలు ( 06108 )మే 12న, జూన్ 2న ఉంటుందని తెలిపారు అధికారులు.