బెట్టింగ్ యాప్ అరాచకం : రైలు కింద పడి రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

బెట్టింగ్.. బెట్టింగ్.. బెట్టింగ్ యాప్స్..ఈ అలవాటు నిక్షేపంగా ఉండే కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా జీవితాలను భిన్నాభిన్నం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాలో జరిగిన ఘటన సంచలనంగా మారింది. రైల్వే శాఖలో మంచి ఉద్యోగం చేసుకుంటున్న దేవర రాజు.. బెట్టింగ్ యాప్ లో బెట్టింగ్స్ పెట్టి.. లక్షల రూపాయలు నష్టపోయాడు.. రైల్వే శాఖలో ఉద్యోగం అయినా.. అప్పులు తీర్చే మార్గం లేక.. అప్పుల వాళ్లు ఒత్తిడులతో.. అప్పు తీర్చే మార్గం లేక.. రైలు కింద పడి చనిపోయాడు. 

రఘునాథపల్లి మండలానికి చెందిన దేవర రాజు.. ఆన్ లైన్ బెట్టింగ్స్ యాప్స్ లో బెట్టింగ్స్ పెట్టేవాడు. భారీగా డబ్బులను నష్టపోయాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఓ వైపు ఆర్థికంగా నష్టపోవటం.. మరో వైపు అప్పులు తీర్చే మార్గం లేకపోవటంతో.. రఘునాథపల్లి రైల్వేస్టేషన్ లోనే.. రైలు కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. 

దేవరరాజు ఆత్మహత్యతో ఆ కుటుంబం విలవిలలాడింది. రైల్వే శాఖలో మంచి ఉద్యోగం.. అయినా ఇలా చేసుకోవటంపై కన్నీరు మున్నీరు అవుతున్నారు కుటుంబ సభ్యులు.