తెలంగాణ ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ జులై 20 దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. స్వామి దర్శనానంతరం సుదర్శన నరసింహ హోమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు హోమంలో డివిజనల్ మేనేజర్ ఏకే గుప్తా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యాదాద్రి (రాయగిరి) రైల్వే స్టేషన్లో ప్రతి రైలు ఆగే విధంగా చర్యలు తీసుకుంటానని అరుణ్ తెలిపారు. అనంతరం ఆయనకు వేద ఆశీర్వచనం అందించిన పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. యాదాద్రిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.