ఆదిలాబాద్టౌన్, వెలుగు : ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే లైన్సాధన కమిటీ సభ్యులు శుక్రవారం ఆదిలాబాద్బస్టాండ్వద్ద ఆందోళనకు దిగారు. నేషనల్హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే రైల్వే లైన్ కు నిధులు మంజూరు చేయాలని, పనులు ప్రారంభించాలని డిమాండ్చేశారు. సాధన కమిటీ చైర్మన్ నారాయణ, సభ్యులు పాల్గొన్నారు.