భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైన్​కు రూ.2,155కోట్లు శాంక్షన్

భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైన్​కు రూ.2,155కోట్లు శాంక్షన్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాచలం–-కొవ్వూరు రైల్వే లైన్​కు రూ. 2,155కోట్లు శాంక్షన్​ చేస్తున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్​ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్​కు చెందిన బీజేపీ ఎంపీ పురందేశ్వరి భద్రాచలం–-కొవ్వూరు రైల్వే లైన్​ నిర్మాణంపై పార్లమెంట్​లో అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి సమాధానమిచ్చారు.

ఈ మేరకు కొవ్వూరు రైల్వే లైన్​ సాధన సమితి కన్వీనర్​ కొదుమ సింహం పాండురంగాచార్యులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే లైన్​ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నట్టు మంత్రి తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.