- బుధ, శుక్రవారాల్లో సిటీ నుంచి స్టార్ట్
హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ నుంచి గోవాకు వీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి ఈ ట్రైన్బయలుదేరి వెళ్తుందని తెలిపారు. గోవా నుంచి ప్రతి గురు, శనివారాల్లో తిరుగు ప్రయాణం అవుతుందని ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఉన్న ట్రైన్ 10 కోచ్‌లతో సికింద్రాబాద్‌నుంచి బయలుదేరి ఏపీలోని గుంతకల్చేరుకునేది. అక్కడ తిరుపతి నుంచి వచ్చే మరో10 కోచ్‌లను కలుపుకుని గోవాకు బయలుదేరేది. తిరుపతి ట్రైన్వచ్చే వరకు సికింద్రాబాద్‌నుంచి వెళ్లిన ప్రయాణికులు వెయిట్చేయాల్సి వచ్చేది.
ఇక నుంచి ఆ సమస్య ఉండదు. కొత్త ట్రైన్సికింద్రాబాద్ నుంచి కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల, కర్నూల్, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్లీ, ధార్వాడ్, లోండా, క్లాసిక్రాక్, కులెం సాన్వోరెడెమ్, మడగావ్ జంక్షన్ల మీదుగా వాస్కోడిగామాకు చేరుకుంటుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉపయోగపడేలా కొత్త ట్రైన్ఏర్పాటు చేసినందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.