ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనతో రైల్వేశాఖ అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. బాలేశ్వర్ సమీపంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖరగ్‌పూర్-భద్రక్ మధ్యలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన క్రమంలో జూన్ 5, 6 తేదీల్లో షెడ్యూల్ చేసిన పలు రైళ్ల సేవలను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 5న పురూలియా-విల్లుపురం(22605); జూన్ 5, 6 తేదీల్లో ఎస్‌ఎంబీటీ బెంగళూరు-హావ్‌డా(12246); ఈ నెల 5న (12864) ఎస్‌ఎంబీటీ బెంగళూరు -హావ్‌డా రైళ్లను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.
జూన్ 4న చెన్నై సెంట్రల్ నుంచి హావ్‌డా వెళ్లాల్సిన రైలు(12840)ను అధికారులు రద్దు చేసిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ -గువాహటి (12513) రైలును ఖరగ్‌పూర్, టాటా, రూర్కెలా, ఝార్సుగుడా మీదుగా డైవర్ట్ చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు.