రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రయాణంలో ఆరోగ్యసమస్యలు వస్తే వెంటనే ట్రీట్​మెంట్​

 ప్రయాణికులకు గుడ్ న్యూస్. ..రైలు ప్రయాణాల్లో మీకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ అదిరిపోయే సర్వీస్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.ఇండియాలో చాలామంది తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు రైళ్లలో ప్రయాణాలు చేస్తుంటారు. అయితే రైలు ప్రయాణం (Train Journey) చేసేటప్పుడు ప్యాసింజర్లకు అప్పుడప్పుడు  ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. వీటన్నిటినీ పరిష్కరించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ రైల్‌మదద్ (RailMadad) సేవను ప్రారంభించింది.

రైల్వే ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సేవలందించేందుకు భారతీయ రైల్వే సరికొత్త ఆఫర్లను తీసుకొస్తోంది.   రైళ్లలో ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే వైద్య సేవలను అందించేందుకు ప్లాన్​ చేసింది. రైలులో ప్రయాణించేటప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు రైల్వే టీటీని సంప్రదించాలని రైల్వే శాఖ తెలిపింది.  ఆన్​ కాల్​ సర్వీస్​ ద్వారా సెంట్రల్​ రైల్వే డాక్టర్లు వైద్య సేవలు 24 గంటలు  అందచేయనున్నారు. ఈ మధ్య కాలంలో రైలులో ప్రయాణించేటప్పుడు కొంతమంది ఆరోగ్య పరంగా సమస్యలు ఎదుర్కొన్నారు. 

రైల్వే ప్రయాణికులకు ఆరోగ్య సమస్య వస్తే.. టీటీఈ ని సంప్రదిస్తే.. టీటీఈ నెక్స్ట్​ రైల్వే స్టేషన్​ మేనేజర్​ కు సమచారమిస్తారు.   వచ్చే రైల్వే స్టేషన్​ లో వైద్య బృందాన్ని సిద్దంగా ఉంటుంది. బాధితులకు వైద్యసహాయం తక్షణం అందిస్తారు.  డాక్టర్లతో పాటు పారామెడికల్​ సిబ్బంది కూడా ఉంటుంది. 

ఇటీవల జరిగిన ఒక సంఘటనలో రైలు నంబర్ (22114) కొచ్చువేలి-ఎల్‌టిటి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మడ్‌గావ్ నుండి ఎల్‌టిటికి ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి గుండె నొప్పి వచ్చింది. అతని బంధువులు రైల్‌మదద్ ద్వారా సహాయం కోసం విజ్ఞప్తి చేశారు. LTT డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్‌తో పాటు వైద్య బృందం సకాలంలో సహాయాన్ని అందించారు.   ఆ ప్రయాణికుడికి సకాలంలో వైద్య సహాయం అందడంతో ప్రమాదం తప్పింది.

మరో ఘటనలో జూన్​ 6 వ తేదీన  ( 17412 )కొల్హాపూర్- ముంబై  మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌లో ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడింది.  దీంతో సమాచారం అందుకున్న రైల్వే అధికారులు కర్జాత్​ స్టేషన్​లో ఒక వైద్య  బృందం సిద్ధంగా ఉంది, అక్కడ మహిళను ఆసుపత్రికి తీసుకువెళ్లారు, అక్కడ ఆమె ఆరోగ్యకరమైన ఆడ శిశువుకు జన్మనిచ్చింది. 

ఈ ఏడాది(2024) జూన్​ 1 వతేదీ నుంచి జులై 31 వరకు మొత్తం 2వేల 19 మంది రైల్వే ప్రయాణికులకు డాక్టర్​​ ఆన్​ కాల్​ బృందాలు  వైద్య సహాయం అందించినట్టు  రైల్వే అధికారులు తెలిపారు.  ఇందులో నాగ్‌పూర్ డివిజన్‌లో 815 మంది ప్రయాణికులు, భుసావల్ డివిజన్‌లో 587 మంది ప్రయాణికులు, 297 మంది ప్రయాణికులు ఉన్నారు. పూణే డివిజన్‌లో, షోలాపూర్ డివిజన్‌లో 236 మంది, ముంబై డివిజన్‌లో 84 మంది ప్రయాణికులు ఉన్నారు.