సికింద్రాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే రిటైర్డ్ఉద్యోగుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఈ నెల 16న పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్రైల్ నిలయం నాలుగో అంతస్తులోని ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఆఫీసులో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు పెన్షన్ అదాలత్ జరుగుతుందన్నారు.
అదే సమయంలో సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు నాందేడ్ ఇతర యూనిట్లలో విడివిడిగా పెన్షన్అదాలత్ జరుగుతుందని అధికారులు వెల్లడించారు. రిటైర్డ్రైల్వే ఉద్యోగులు తన సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.