
కాజీపేట, వెలుగు : బిహార్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రక్సోల్ ఎక్స్ ప్రెస్ రైలులో 11మంది బాల కార్మికులను రెస్క్యూ చేసి, వారిని తరలిస్తున్న నలుగురు దళారులను అదుపులోకి తీసుకున్నట్లు కాజీపేట ఆర్పీఎఫ్ సీఐ సంజీవరావు తెలిపారు. బిహార్, యూపీకి చెందిన బాలలను పనికోసం సికింద్రాబాద్ తరలిస్తున్నట్టు గుర్తించారు. వారిని హనుమకొండలోని ఓయాసిస్ ఓపెన్ షెల్టర్ హోం కు తరలించి, దళారులపై కేసులు నమోదు చేశామన్నారు.