
హైదరాబాద్, వెలుగు: లాలాగూడలోని సెంట్రల్ హాస్పిటల్‌లో మెడికల్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్‌కోసం దక్షిణ మధ్య రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. 9 మంది మెడికల్ ఎక్స్‌పర్ట్స్, 16 మంది జనరల్ డ్యూటీ ఆఫీసర్స్, 31 నర్సింగ్ సూపరిండెంట్లు, 4 ల్యాబ్ అసిస్టెంట్స్,50 హాస్పిటల్ అటెండెంట్స్ పోస్ట్స్ కోసం టెంపరరీ రిక్రూట్‌మెంట్ చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అర్హులు ఈ నెల 15వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ లో వీడియో కాలింగ్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని రైల్వే అధికారులు చెప్పారు. దరఖాస్తులు http://www.scrindianrailways.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. కాగా లాలాగూడ సహా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మరో 4 ప్రధాన హాస్పిటల్స్‌లో కరోనాకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు.
For More News..