రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పారా-మెడికల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా వివిధ రైల్వే రీజియన్లలో 1,376 పారా మెడికల్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, జీఎన్‌ఎం, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
సెలెక్షన్: సీబీటీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష), రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాతపరీక్ష మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.
దరఖాస్తులు: ఆర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.indianrailways.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.