రైల్వే ట్రాక్ బేస్ లోపం.. నిలిచిపోయిన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్

పెద్దపల్లి: రైల్వే ట్రాక్ బేస్ లోపంతో పెద్దపల్లి జిల్లాలో భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. మంగళవారం ఉదయం కాగజ్నగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ దాదాపు గంటకు పైగా ఓదెల మండలం ఉప్పరపల్లి వద్ద నిలిపివేశారు అధికారులు. ఉప్పరిపల్లి వద్ద రైల్వే ట్రాక్ బేస్ లోపం తలెత్తడంతో రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.