
ఈ మధ్య వరుసగా రైలు ప్రమాదాలు భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చాయి.. తాజగా ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘోర రైలు ప్రమాదం తప్పింది.. తిరుపతి జిల్లా పూతలపట్టు మండలంలో రైలు పట్టా విరిగింది. ఈ విషయాన్ని ముందుగా గ్యాంగ్ మేన్ గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.. విరిగిన పట్టాను గమనించి.. దీనిపై అధికారులకు సమాచారం ఇచ్చాడు గ్యాంగ్‌మెన్.. దీంతో.. రామేశ్వరం నుంచి వస్తున్న రైలును నిలిపివేశారు అధికారులు.. మరమ్మతులు చేసి యథావిథిగా రైళ్లను నడుపుతున్నారు.. రైలు పట్టా మరమ్మతుల కారణంగా 10 నిమిషాలు ఆలస్యంగా పాకాలకు చేరుకుంది రైలు.. ప్రస్తుతానికి ఆ రూట్‌లో రైళ్ల రాకపోకలు యథావిథిగా కొనసాగుతున్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు.