ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాల్సిన మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ తో సహా పలు రైళ్ల నిలిపివేశారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో రైళ్లు ఆగిపోయాయి. కేసముద్రం మండలం తల్లపూసపల్లి శివారు రైల్వే స్టేషన్ సమీపంలో వరద కారణంగా రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. పట్టాల కింద కంకర, మట్టి కొట్టుకుపోయింది. కేవలం పట్టాలు మాత్రమే వరద నీటిపై ఉన్నాయి. అప్రమత్తమైయిన రైల్వే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.
Also Read :- వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు