దేశ వ్యాప్తంగా రైల్వే భద్రతాపరమైన పనులు మొదలుపెట్టింది. గతేడాది ఒడిస్సాలో బాలసోర్ దగ్గర కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. అప్పటి నుంచి మరే ప్రాంతాల్లోను ఇలాంటి ప్రమాదాలకు తావులేకుండా ...రైల్వే అలర్ట్ అయ్యింది. అన్ని రాష్ట్రాల్లోను మరమ్మత్తులు చేస్తుంది. ప్రస్తుతం విశాఖ రూట్లో మరమ్మత్తులు చేయించడానికి రైల్వే ఫిక్స్ అయ్యింది. సెప్టెంబర్ 1 వ తారీఖు వరకు ఈ రూట్లో రైళ్లు నడవనని తెలిపింది.
రద్దయిన రైళ్ల వివరాలు
- షాలిమార్- హైదరాబాద్ (18045)
- పూరీ-ఓఖా (20819)
- ఓఖా-పూరీ (20820)
- నిజాముద్దీన్-విశాఖపట్నం(12804)
- ఛత్రపతి శివాజీ టెర్మినల్-భువనేశ్వర్ (11019)
- నర్సాపూర్-నాగర్‌సోల్ (12787)
- నాగర్‌సోల్-నర్సాపూర్ (12788)
- మచిలీపట్నం-బీదర్ (12749)
- బీదర్-మచిలీపట్నం (12750)
- హైదరాబాద్-షాలిమార్ (18046)
- షిర్డీ సాయినగర్-కాకినాడ పోర్టు (17205)
- కాకినాడ పోర్ట్-షిర్డీ సాయినగర్ (17206)
- భువనేశ్వర్ -ఛత్రపతి శివాజీ టెర్మినల్ (11020)
- యశ్వంత్‌పూర్-టాటా (18112)
- టాటా-యశ్వంత్‌పూర్ (18111)
- హైదరాబాద్-తాంబరం (12760)
- గుంతకల్-బీదర్ (07671) ఆగస్టు 31 వరకు
- కాచిగూడ-గుంతకల్ (07670) -సెప్టెంబర్ 1 వరకు
- కాచిగూడ-రాయచూర్ (17693) ఆగస్టు 31 వరకు రద్దయ్యాయి.
కొన్ని నెలలుగా విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే డివిజన్లలో మరమ్మతు పనులు జరుగుతుండటంతో తీవ్రస్థాయిలో రైళ్లు రద్దవుతున్నాయి. ప్రయాణికులు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని మెయిన్ రైళ్లు క్యాన్సిల్ చెయ్యాలంటే రైల్వే మరోలా ఆలోచన చేస్తుంది . జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను రద్దు చేశారు ...విమర్శలు భరించలేక తిరిగి ప్రారంభించారు.