
హైదరాబాద్, వెలుగు: “మిషన్ జీరో స్క్రాప్ ” కింద ఇనుప తుక్కును విక్రయించడంతో దక్షిణ మధ్య రైల్వేకు( 2024~25 ఆర్థిక సంవత్సరం) రూ. 501.72 కోట్ల ఆదాయం సమకూరినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ బుధవారం (ఏప్రిల్ 2) ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రైల్వే బోర్డు రూ. 430 కోట్లను తమకు టార్గెట్ పెట్టిందని, దీన్ని అధిగమించామని చెప్పారు.
వేలం ద్వారా ఇనుప తుక్కును విక్రయించడంలో తమ జోన్ ముందుందని తెలిపారు. ఇనుప తుక్కు విక్రయం వల్ల రైల్వేకు ఆదాయం సమకూరడంతో పాటు “స్వచ్ఛ భారత్ అభియాన్” ప్రాజెక్టు కింద రైల్వే యూనిట్ల ప్రాంగణాలు క్లీన్ అవుతున్నాయని పేర్కొన్నారు.