
న్యూఢిల్లీ: రైల్వే నర్సింగ్ సూపరింటెండెంట్ ప్రవేశ పరీక్షపై కొత్త వివాదం రాజుకుంది. ఏప్రిల్ 28 నుంచి 30 వరకు జరగనున్న ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఇప్పటికే జారీ చేశారు. ఇందులోని కొన్ని నిబంధనలు వివాదానికి ఆజ్యం పోశాయి. సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో జరగనున్న పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మంగళసూత్రం, చెవిపోగులు, ముక్కుపుడకలు, ఉంగరాలు, బ్రాస్లెట్లు, జంజం సహా ఎలాంటి ఆభరణాలను ధరించడంపై నిషేధం విధించారు.
అయితే.. మంగళసూత్రం, జంజం వంటి మతపరమైన చిహ్నాలను తొలగించాలన్న ఆదేశాలపై వివాదం చెలరేగింది. ఈ నిబంధనలపై హిందు సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. హిందువుల మత స్వేచ్ఛను ఉల్లంఘింస్తున్నారని.. తక్షణమే ఆ నిబంధనలను ఉపసంహరించుకోవాలని హిందు సంఘాలు డిమాండ్ చేశాయి. మత స్వేచ్ఛను ఉల్లంఘింస్తోన్న ఈ ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ (VHP) డిమాండ్ చేసింది.
►ALSO READ | ప్రధాని మోడీతో రాజ్నాథ్ సింగ్ భేటీ.. యుద్ధానికి ముహూర్తం ఫిక్స్ చేశారా..?
ఈ చర్య కోట్లాది మంది హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుందని పేర్కొంది. హిందువులు మెజారిటీగా ఉన్న దేశంలో ఇటువంటి హిందూ వ్యతిరేక విధానాలను సహించడం అసాధ్యమని పేర్కొంది. కాగా, ఈ నెల (ఏప్రిల్) ప్రారంభంలో జరిగిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CET) సందర్భంగా హిందూ విద్యార్థులను పవిత్ర దారాలను తొలగించమనడం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.