- మంగళవారం నుంచి 15 రూట్లలో మొత్తం 30 రైళ్లు ప్రారంభం
- తెలుగు రాష్ట్రాలను టచ్ అయ్యే రూట్స్ నాలుగు
- తెలంగాణలో రెండు.. ఏపీలో మూడు స్టేషన్లలో స్టాపింగ్స్
కరోనా లాక్ డౌన్ కారణంగా ఆగిన రైలు ప్రయాణాలను మళ్లీ స్టార్ట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి (మంగళవారం) నుంచి 15 రూట్లలో 30 స్పెషల్ ట్రైన్లు నడిపేందుకు రైల్వే శాఖ రెడీ అయింది. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ఇవాళ (సోమవారం) సాయంత్రం స్టార్ట్ చేసింది. ఇప్పటికే వలస కార్మికులను సొంత ఊర్లకు చేర్చేందుకు శ్రామిక్ స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్న రైల్వే శాఖ.. సాధారణ ప్రయాణికుల కోసం 15 మేజర్ రూట్లలో స్పెషల్ ట్రైన్లను మొదలు పెడుతోంది. న్యూఢిల్లీ నుంచి పలు రాష్ట్రాల ప్రధాన నగరాలను కలుపుతూ రైళ్లను నడపాలని నిర్ణయించిన రైల్వే శాఖ ఈ ట్రైన్లు చాలా లిమిటెడ్ స్టేషన్లలోనే అగుతాయని ప్రకటించింది. అయితే తెలుగు రాష్ట్రాలను టచ్ చేస్తూ వెళ్లే రూట్స్ కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి. సికింద్రాబాద్ – న్యూఢిల్లీ మధ్య సర్వీస్ స్టార్ట్ చేస్తుండగా.. చెన్నై, బెంగళూరు వెళ్లే ట్రైన్లకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని స్టేషన్లలో స్టాపింగ్స్ ఉన్నాయి. మొత్తంగా ఈ స్పెషల్ ట్రైన్లు తెలంగాణలో రెండు స్టేషన్లు, ఏపీలో మూడు స్టేషన్లలో మాత్రమే ఆగుతాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఆగే ట్రైన్లు ఇవే..
– సికింద్రాబాద్ – న్యూఢిల్లీ (20437), న్యూఢిల్లీ – సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ (20438): ఈ రెండు ట్రైన్లు వీక్లీ బేసిస్ లో నడుస్తాయి. సికింద్రాబాద్, నాగ్ పూర్, భోపాల్, ఝాన్సీ, న్యూఢిల్లీ స్టేషన్లలో ఆగుతాయి.
– చెన్నై – న్యూఢిల్లీ మధ్య నడిచే రైళ్లకు ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని వరంగల్ స్టేషన్లతో పాటు నాగ్ పూర్, భోపాల్, ఝాన్సీ, ఆగ్రా స్టేషన్లలో స్టాపింగ్స్ ఉన్నాయి.
– బెంగళూరు – న్యూఢిల్లీ మధ్య నడిచే రైళ్లు ఏపీలోని అనంతపూర్, గుంతకల్, తెలంగాణలోని సికింద్రాబాద్ సహా నాగ్ పూర్, భోపాల్, ఝాన్సీ స్టేషన్లలో ఆగుతాయి.