Maa Kaali Teaser: హిందువుల ఊచకోత..మతం మారితేనే బ్రతుకు లేకపోతే చావు..మరో సెన్సేషన్ మూవీ

Maa Kaali Teaser: హిందువుల ఊచకోత..మతం మారితేనే బ్రతుకు లేకపోతే చావు..మరో సెన్సేషన్  మూవీ

టాలీవుడ్ లో బడా బ్యానర్ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నుండి సాలిడ్ కంటెంట్‌తో మా కాళి(Maa Kaali) అని మూవీ రాబోతుంది. తాజాగా ఈ మూవీ నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. రైమా సేన్, నటుడు అభిషేక్ సింగ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నఈ సినిమాని డైరెక్టర్ విజయ్ యెలకంటి తెరకెక్కిస్తున్నారు. బెంగాల్‌లో స్వాతంత్ర్యం సమయంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా మా కాళి తెరకెక్కింది. 

టీజర్ విషయానికి వస్తే..

1946లో బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్‌లో జరిగే మరణకాండతో ‘మా కాళి’ టీజర్ మొదలవుతుంది. భారతదేశం నుంచి పాకిస్థాన్ విభజన సమయంలో బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులను అక్కడ ముస్లిమ్స్ ఎలా ఊచకోత కోసారు అనే పాయింట్ తో వచ్చిన ఈ మూవీ ఆద్యంతం ఉత్కంఠ రేపుతోంది. టీజర్ లో వచ్చే డైలాగ్స్, సీన్స్ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి.

‘మనం చాలా ఏళ్ల పాటు హిందువుల మీద అధికారం చలాయించాం. మరి ఇప్పుడు వాళ్ల అధికారంలో మనం ఉందామా..అంటూ ఒక ముస్లిం వ్యక్తి ప్రశ్నించగా..'దీంతో ఇప్పటినుండి హిందుస్థాన్ అనేది ఉండదు, పాకిస్థాన్ మాత్రమే ఉంటుంది అంటూ అక్కడి ప్రజలంతా నినాదాలు చేస్తుంటారు.హిందుస్థాన్‌కు అధికారం బదిలీ చేయాలని బ్రిటీష్ సర్కార్ నిర్ణయించింది. హిందువులు అఖండ భారత్ కోసం పగటి కలలు కంటున్నారు’’ అంటూ హిందూ ముస్లిం విభేదాలను రెచ్చగొడతాడు ఆ దేశ ప్రధాన మంత్రి హుసేన్ షాహేద్.

జిన్నా సాబ్ ఆదేశాల మేరకు ఆగస్ట్ 16ను డైరెక్ట్ యాక్షన్ డేగా ప్రకటిస్తున్నాను అంటూ ప్రకటించడం..ఈ గడ్డ పాకిస్థాన్ అయ్యి తీరుతుంది’ అంటూ నినాదాలు చేస్తూ కంటికి కనిపించిన హిందువులను చంపుకుంటూ పోవడంతో టీజర్ ఆసక్తిగా మారింది. ఇంకా టీజర్ చివర్లో..జరిగే ఆ భీకరమైన గొడవల్లో రైమా సేన్ కుటుంబానికి దిక్కుతోచదు. ఆ ఘర్షణల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. హిందువులకు వేరే దారి లేదు. మతం మారితేనే బ్రతుకు లేకపోతే చావు అంటూ రైమా సేన్ చెప్పే డైలాగ్‌తో ‘మా కాళి’ టీజర్ ఎండ్ అవుతుంది. 

కేవలం రిలీజ్ చేసిన టీజర్ తోనే ఇంతటి ఇంపాక్ట్ చూపించిన మేకర్స్..సినిమా రిలీజయ్యాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాను బెంగాలీతో పాటు హిందీ, తెలుగులో రిలీజ్ చేయనున్నారు. త్వరలో రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది.