హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురిశాయి. అత్యధికంగా గాజులరామారం, జీడిమెట్ల 4.8 మిల్లీమీటర్ల వర్షం పడింది. కూకట్పల్లి 4.5, రాజేంద్రనగర్ 3.5, ఖైరతాబాద్, బోరబండ 2.3 మి.మీ. వాన కురిసింది. ఉదయం ఎండ దంచికొట్టగా, మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై ఈదురు గాలులు వీచాయి. వాతావరణంలోని మార్పులు కారణంగా జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. మరికొన్ని రోజులు వాతావారణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.