Rain alert: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం... మూడు రోజుల పాటు వర్షాలు

Rain alert: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం... మూడు రోజుల పాటు వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని అనుభంద ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని ఐఎండి అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.  దీని ప్రభావంతో రానున్న రెండు రోజులలో ( డిసెంబర్​ 19,20) అల్పపీడనం బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 

ఐఎండి  అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... . ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య గాలులు వీస్తున్నాయి . వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉండొచ్చు.

ఉత్తర కోస్తా .. ఆంధ్రప్రదేశ్  వ్యాప్తంగా  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ... ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి ..  రెండు చోట్ల సంభవించే అవకాశముంద . బుధవారం ( డిసెంబర్​ 18)  ఒక మోస్తరు వర్షాలు..ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.

 గురువారం ( డిసెంబర్​ 19) తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు కురిసే అవకాశముంది. రాయలసీమలో  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.