హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. హైదరాబాద్‌లోనూ రెండ్రోజుల పాటు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గురువారం పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో 5.1 సెంటీమీటర్ల వర్షం పడింది. మంచిర్యా ల జిల్లా కొండాపూర్‌లో 4.5, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో 3.4, తెల్కపల్లి లో 3.3, నల్గొండ జిల్లా జూనూతలలో 3.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది.