AP Rains: రెయిన్ అలర్ట్.. ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు

AP Rains: రెయిన్ అలర్ట్..  ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు

ఏపీని  అల్పపీడనం వదలడం లేదు. రాగల మూడు రోజులు పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. డిసెంబర్ 17 వరకు పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. రానున్న 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.  ఆ తర్వాత, మరింత బలపడి బాగా గుర్తించబడిన అల్పపీడనంగా మారి వచ్చే రెండు రోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో వర్షాలు పడనున్నాయి. 

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ లో

 డిసెంబర్ 15 న  వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. డిసెంబర్ 16న  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు  కురిసే అవకాశముంది. 17న  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రాయలసీమలో 

డిసెంబర్ 15న  వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది . డిసెంబర్ 16న   తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. 17న  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది