అలర్ట్: తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

అలర్ట్:  తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

హైదరాబాద్ : తెలంగాణలో రాగల మూడు రో జులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతా వరణ కేంద్రం పేర్కొంది. అక్టోబర్ 30న ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువ నగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కా జగిరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. 

ALSO READ | తెలంగాణకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక.. హైదరాబాద్ పబ్లిక్ జర జాగ్రత్త..

అలాగే,  అక్టోబర్ 31, నవంబర్ 1 శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుపడే అవకాశాలున్నాయని వివరించింది.